రోశయ్య రోషం అర్ధరహితమన్న బాబు
గ్రేటర్ ఎన్నికల్లో తక్కువ సీట్లు వస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి కె.రోశయ్య చేసిన సవాల్ ను తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు తిరస్కరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా టీడీపీ ఒక్క స్థానం ఎక్కువ గెలిచినా తాను రాజీనామా చేస్తానని, తన సవాల్ పై చంద్రబాబు వెంటనే కాకున్నా ఒకటి రెండు రోజుల తర్వాతైనా స్పందించ వచ్చంటూ రోశయ్య ఆదివారం సవాల్ చేసిన విషయం విదితమే. రోశయ్య సవాల్ పై మంగళవారం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడుతూ'బోడిగుండుకు - మోకాలికి ముడిపెట్టినట్టుగా సీఎం సవాల్ ఉందని హేళన చేశారు. ఓబుళాపురం వ్యవహారంపై కఠినంగా, నిబంధనల మేరకు వ్యవహరించాలని తాము నిలదీస్తే గ్రేటర్ ఎన్నికలకు ముడిపెట్టి రాజీనామా సవాల్ చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రోశయ్య రాష్ట్ర ఖనిజ సంపదను అక్రమంగా దోచుకుంటున్న వ్యవహారంపై స్పందించకపోవడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. గ్రేటర్ ఎన్నికలు స్థానికమైతే ఓఎంసి అక్రమాలు రాష్ట్ర సంపదకు ముప్పని ఈ రెంటికీ సంబంధమే లేదని ఆయన దుయ్యబట్టారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment