ఘనంగా భగవాన్ జన్మదిన వేడుకలు
భగవాన్ పుట్టపర్తి సత్యసాయిబాబా 84వ జన్మదిన వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి. వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ వేడుకలను నిర్వహించారు. పాలనురుగు లాంటి తెల్లటి వస్త్రాలతో ఉదయం 10 గంటల సమయంలో బాబా భక్తులకు దర్శనం ఇచ్చారు. మల్లాది సోదరులు భక్తి గీతాలు ఆలపించారు. తన తల్లి ఈశ్వరమ్మ పై పాట పాడాలని వారిని బాబా ఆదేశించారు. వారు ఈశ్వరమ్మ మహాసాథ్వి అనే పాటను పాడగా బాబా చిన్న బాల్య స్మృతులను తలచుకొని కదిలిపోయారు. పుట్టపర్తిలోని సాయి కుల్వంత్ హాల్‌లో ఈ వేడుకలు జరిగాయి. భక్తులు స్వామి దర్శనం, ఆయన ఆశీస్సుల కోసం గంటల తరబడి వేచివున్నారు. కుల్వంత్ హాల్‌లో్ని తన మందిరంలో జన్మదిన వేడుకల సందర్భంగా సత్యసాయి బాబా కేక్‌ను కట్ చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్, సమాచార శాఖ మంత్రి గీతారెడ్డి, టిటిడి బోర్డ్ చైర్మన్ ఆదికేశవులునాయుడు పాల్గొని బాబా ఆశీస్సులందుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment