అనంత స్వర్ణమయం పనులు మళ్ళీ ప్రారంభం
శ్రీవారి ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పధకానికి ఓ అజ్ఞాత భక్తుడు 25 కేజీల బంగారాన్ని కానుకగా సమర్పించాడు. స్వామి వారి దర్శనానంతరం సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని టిటిడి ప్రత్యేకాధికారి ధర్మారెడ్డికి ఆ భక్తుడు అందజేశారు. అనంత స్వర్ణమయం పధకానికి దీనితో కలిపి మొత్తం సుమారు 116 కేజీల బంగారం భక్తులనుంచి విరాళంగా లభించింది. అలానే ముంబాయికి చెందిన శ్రీనివాస్ అనే మరో భక్తుడు ఒక కేజీ బంగారాన్ని శ్రీవారి ఆలయంలో ఇదే పధకం కోసం అందజేశారు. అనంత స్వర్ణమయం పనులు బంగారం కొరత, ఇంకా కొన్ని ఇబ్బందుల కారణంగా గత రెండు నెలలుగా ఆగిపోయాయి. సోమవారం నుంచి ఈ పనులు తిరిగి ప్రారంభమయ్యాయని టిటిడి చైర్మన్ ఆదికేశవులు నాయుడు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment