Saturday, November 28, 2009

The World’s Worst Floods By Death Toll
The World’s Worst Floods The Deadliest Floods As Measured By Death Toll
The World’s Worst Floods The Deadliest Floods As Measured By Death Toll
Throughout history, floods have proven to be the deadliest natural disasters. This is mainly due to the high population densities around rivers. When well-behaved, rivers provide the resources needed for agriculture, transportation, and industry. It is no accident that all of the ancient civilizations rose around rivers.
It also should be noted that not all of the dead were the victims of the initial floodwaters. Disease and famine that followed the disasters probably killed more than the floodwaters themselves.
Flooding disasters primarily as a result of typhoons or hurricanes have been excluded from this list and are instead included on the list of worst hurricane disasters.
1. Huang He (Yellow) River, China 1931 Death Toll: 1,000,000 to 3,700,000
The Huang He River is prone to flooding because of the broad expanse of plain that lies around it. One of the major reasons for the flooding is the high silt content that gives the river its yellow tint (and thus its name). The silt—which constitutes as much as 60% of its volume—builds up until the river actually is higher than the surrounding land. The tendency to flood is exacerbated by ice dams which block the river in Mongolia; the dams back up the water, and then release devastating walls of water when they break.
The history of flooding has prompted the Communist Chinese government to embark on a program of building dams for flood control. The dams, however, have not proven entirely effective and have been the target of criticism from environmentalists.
2. Huang He (Yellow) River, China 1887 Death Toll: 900,000 to 2,000,000
3. Huang He (Yellow) River, China 1938 Death Toll: 500,000 - 900,000
The 1938 flood of the Huang He was caused by Nationalist Chinese troops under Chiang Kai-Shek when they broke the levees in an attempt to turn back advancing Japanese troops. The strategy was partly successful. By 1940, the Japanese were essentially in a stalemate with Chinese forces.
4. Huang He (Yellow) River, China 1642 Death Toll: 300,000
Chinese rebels destroy the dikes along the city of Kaifeng, flooding the surrounding countryside.
5. Ru River, Banqiao Dam, China 1975 Death Toll: 230,000
This flood was caused by the collapse of the Banquia Dam, along with several others, following a heavy rain caused by a typhoon. It is the worst dam related collapse in history.
6. Yangtze River, China 1931 Death Toll: 145,000
Although the Huang He has caused more deaths, the Yangtze has had more than 1,000 recorded floods.
7. The Netherlands and England 1099 Death Toll: 100,000
A combination of high tides and storms flooded the Thames and the Netherlands, killing 100,000.
8. The Netherlands 1287 Death Toll: 50,000
A seawall on the Zuider Zee failed, flooding the low-lying polder.
9. The Neva River, Russia 1824 Death Toll: 10,000
An ice dam clogged the Neva, flooding nearby cities.
10. The Netherlands 1421 Death Toll: 10,000
The failure of a seawall on the Zuider Zee flooded the Dutch lowlands.
Posted by journalist subbu on 01/09 at 10:01 PM

Wednesday, November 25, 2009

రోశయ్య రోషం అర్ధరహితమన్న బాబు
గ్రేటర్ ఎన్నికల్లో తక్కువ సీట్లు వస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి కె.రోశయ్య చేసిన సవాల్ ను తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు తిరస్కరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా టీడీపీ ఒక్క స్థానం ఎక్కువ గెలిచినా తాను రాజీనామా చేస్తానని, తన సవాల్ పై చంద్రబాబు వెంటనే కాకున్నా ఒకటి రెండు రోజుల తర్వాతైనా స్పందించ వచ్చంటూ రోశయ్య ఆదివారం సవాల్ చేసిన విషయం విదితమే. రోశయ్య సవాల్ పై మంగళవారం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడుతూ'బోడిగుండుకు - మోకాలికి ముడిపెట్టినట్టుగా సీఎం సవాల్ ఉందని హేళన చేశారు. ఓబుళాపురం వ్యవహారంపై కఠినంగా, నిబంధనల మేరకు వ్యవహరించాలని తాము నిలదీస్తే గ్రేటర్ ఎన్నికలకు ముడిపెట్టి రాజీనామా సవాల్ చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రోశయ్య రాష్ట్ర ఖనిజ సంపదను అక్రమంగా దోచుకుంటున్న వ్యవహారంపై స్పందించకపోవడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. గ్రేటర్ ఎన్నికలు స్థానికమైతే ఓఎంసి అక్రమాలు రాష్ట్ర సంపదకు ముప్పని ఈ రెంటికీ సంబంధమే లేదని ఆయన దుయ్యబట్టారు.
బీజేపీ నేతలపై నిప్పులు చెరిగిన "లిబర్హాన్"
దేశంలో మత సామరస్యానికి విఘాతం కలిగించిన బాబ్రీ మసీదు కూల్చివేతకు 68 మంది వ్యక్తిగతంగా కారకులని లిబర్హాన్ కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. అటల్ బిహారీ వాజ్ పాయి, సీనియర్ బిజెపి నాయకులు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శివసేన అధిపతి బాల్ థాక్రే వేరిలో ఉన్నారంది. ఉత్తర ప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు అశోక్ సింఘాల్, ప్రవీణ్ తొగాడియా, ఆర్ ఎస్ ఎస్ మాజీ అధిపతి కెఎస్ సుదర్శన్, గోవిందాచార్య, స్వర్గీయ విజయరాజే సింథియా, వినయ్ కతియార్, ఉమా భారతి, సాధ్వీ రితాంబర పేర్లు కూడా లిబర్హాన్ దోషుల జాబితాలో ఉన్నాయి. వీరితో పాటు కొందరు అధికారులు అంటే భద్రత ఐజి ఎకె సరన్, ముఖ్య కార్యదర్శి వికె సక్సేనా వంటివారు కూడా దోషులేనని కమిషన్ పేర్కొంది. మంగళవారం ఈ నివేదికను కేంద్ర హోం మంత్రి చిదంబరం పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టినపుడు సభలో పెద్ద రభస జరిగింది. రెండు సభల్లోనూ బిజెపి సభ్యులు ఆందోళనకు దిగారు. రాజ్యసభలో అయితే బిజెపి- సమాజ్ వాదీ పార్టీ సభ్యులు కొట్టుకునేవరకూ వచ్చింది. పరిస్థితి చేయి దాటి రాజ్యసభను వాయిదా వేయవలసి వచ్చింది. నివేదకను చిదంబరం చదవడం ప్రారంభించగానే బిజెపి సభ్యులు 'జైశ్రీరాం' నినాదాలు ప్రారంభించారు. సమాజ్ వాది నేత అమర్ సింగ్ ఈ నినాదాలు ఆపాలని అరుస్తూ బిజెపి సభ్యుడు అహ్లువాలియా పైకి దూసుకుపోయి ఆయన్ను తోసేశారు. దాంతో మిగతా సభ్యులు లేచి గుమికూడటంతో సభ మార్కెట్ గా మారింది. ఉద్రిక్తత తలెత్తి ఘర్షణ నెలకొనడంతో సభను వాయిదా వేశారు. ఈ నివేదికను ప్రవేశపెట్టే ముందు కేంద్ర మంత్రి వర్గం అత్యవసర భేటీ చోటు చేసుకుంది. ప్రధాని మన్మోహన్ దేశంలో లేనందున ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ భేటీకి అధ్యక్షత వహించారు. తప్పుకి చెంపలేసుకున్న అమర్ సింగ్రాజ్యసభలో తన వల్ల పొరపాటు జరిగిందని సమాజ్ వాదీ నేత అమర్ సింగ్ అంగీకరించారు. తాను అహ్లువాలియాకు క్షమాపణలు చెప్పడానికి సిద్ధమన్నారు. అహ్లూవాలియాను నెట్టడం తన ఉద్దేశం కాదని, అది పొరపాటున జరిగిందని చెప్పారు. తాను కూడా రాముని భక్తుణ్ణేనని అమర్సింగ్ చెప్పారు. కాగా కమిషన్ నివేదక లీక్ అయిన ఉదంతంపై సంయుక్త పార్లమెంటు కమిటీని నియమించాలని బిజెపి నాయకుడు మురళీ మనోహర్ జోషీ డిమాండ్ చేశారు.
PLOTS FOR SALE
-------------------------
NH-5 road facing (West face)1 acre land at Hukumpet junction.
Ideal for commercial purpose
Just 250 mts distance from Rajahmundry Railwaystation East entrance.
92 acres of agricultural land having 10,000 teak plants, mango, orange, jam oil eucalyptus and othergardens provided riveting stone quarry which is useful for projects. Located at Bheemolu village around 29 Kilometres from Rajahmundry.
500 sq,yards East facing residential plot at Danavaipet of Rajahmundry city.
270 sq,yards West facing residential plot at Danavaipet of Rajahmundry city.
220 sq,yards East facing residential plot at Danavaipet of Rajahmundry city
470 sq,yards South East corner bit residential plot at PrakashNagar of Rajahmundry city.
950 sq.yards facing southwest house plot at Tahasildar layout of Rajahmundry city.
North East face Commercial building locating opposite to Anand Regency 3star hotel at Rajahmundry.
Contact for Details :
Adiraju Satya
9704528128
rajahmundry
AndhraPradesh State- INDIA

Tuesday, November 24, 2009

ఘనంగా భగవాన్ జన్మదిన వేడుకలు
భగవాన్ పుట్టపర్తి సత్యసాయిబాబా 84వ జన్మదిన వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి. వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ వేడుకలను నిర్వహించారు. పాలనురుగు లాంటి తెల్లటి వస్త్రాలతో ఉదయం 10 గంటల సమయంలో బాబా భక్తులకు దర్శనం ఇచ్చారు. మల్లాది సోదరులు భక్తి గీతాలు ఆలపించారు. తన తల్లి ఈశ్వరమ్మ పై పాట పాడాలని వారిని బాబా ఆదేశించారు. వారు ఈశ్వరమ్మ మహాసాథ్వి అనే పాటను పాడగా బాబా చిన్న బాల్య స్మృతులను తలచుకొని కదిలిపోయారు. పుట్టపర్తిలోని సాయి కుల్వంత్‌ హాల్‌లో ఈ వేడుకలు జరిగాయి. భక్తులు స్వామి దర్శనం, ఆయన ఆశీస్సుల కోసం గంటల తరబడి వేచివున్నారు. కుల్వంత్‌ హాల్‌లో్ని తన మందిరంలో జన్మదిన వేడుకల సందర్భంగా సత్యసాయి బాబా కేక్‌ను కట్‌ చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌, సమాచార శాఖ మంత్రి గీతారెడ్డి, టిటిడి బోర్డ్‌ చైర్మన్‌ ఆదికేశవులునాయుడు పాల్గొని బాబా ఆశీస్సులందుకున్నారు.
అనంత స్వర్ణమయం పనులు మళ్ళీ ప్రారంభం
శ్రీవారి ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పధకానికి ఓ అజ్ఞాత భక్తుడు 25 కేజీల బంగారాన్ని కానుకగా సమర్పించాడు. స్వామి వారి దర్శనానంతరం సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని టిటిడి ప్రత్యేకాధికారి ధర్మారెడ్డికి ఆ భక్తుడు అందజేశారు. అనంత స్వర్ణమయం పధకానికి దీనితో కలిపి మొత్తం సుమారు 116 కేజీల బంగారం భక్తులనుంచి విరాళంగా లభించింది. అలానే ముంబాయికి చెందిన శ్రీనివాస్‌ అనే మరో భక్తుడు ఒక కేజీ బంగారాన్ని శ్రీవారి ఆలయంలో ఇదే పధకం కోసం అందజేశారు. అనంత స్వర్ణమయం పనులు బంగారం కొరత, ఇంకా కొన్ని ఇబ్బందుల కారణంగా గత రెండు నెలలుగా ఆగిపోయాయి. సోమవారం నుంచి ఈ పనులు తిరిగి ప్రారంభమయ్యాయని టిటిడి చైర్మన్ ఆదికేశవులు నాయుడు తెలిపారు.

Thursday, November 19, 2009

సదా మీ సేవలో



తెలుగులో మంచి వార్తలు, వ్యాసాలు, కవితలు ఇంకా విశ్లేషణలతో ఈ బ్లాగ్ ను మీ అందరి అభిరుచుల మేరకు నిర్వహించడమే నా అభిమతం. భారతదేశ సమున్నత సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పడంలో ఈ బ్లాగ్ మనందరి శక్తివంతమైన సాధనంగా మారగలదని ఆశిస్తూ....
సదా మీ సేవలో
దీక్షితుల సుబ్రహ్మణ్యం